: మీరు భయపడకండి...కేంద్రంలో మన బీజేపీ ఉంది: బాబు భరోసా
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర టీడీపీ ఎమ్మెల్యేలకు ఆత్మస్థైర్యాన్ని నూరిపోశారు. హైదరాబాదులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ, ఇతర పార్టీలు చూపే ప్రలోభాలకు లొంగవద్దని, చౌకబారు బెదిరింపులకు భయపడవద్దని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై అసెంబ్లీలో, బయట కలిసికట్టుగా పోరాడాలని ఆయన ఆదేశించారు. టీఆర్ఎస్ లో చేరకుంటే నియోజకవర్గ నిధులు నిలిపేస్తామని టీ మంత్రులు బెదిరిస్తే భయపడవద్దని, కేంద్రంలో మిత్రపక్షం అధికారంలో ఉందని బాబు భరోసా ఇచ్చారు.