: రెండు హత్యలు చేశానని పోలీసులను హడలెత్తించిన తాగుబోతు


విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఓ తాగుబోతు పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించాడు. పూటుగా తాగిన ఓ వ్యక్తి తూలుతూ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. వస్తూనే తాను ఇద్దరు మహిళలను చంపేసి చెరువులో పడేశానని చెప్పాడు. అతను చెప్పిన మాటలను, చేసిన ప్రమాణాలను నమ్మిన పోలీసులు అతను చంపేశానని చెబుతున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. ఓ చెరువులో పడేశానని చెప్పడంతో గజఈతగాళ్లతో ఆ చెరువును జల్లెడ పట్టారు. మహిళల శవాలు దొరకకపోవడంతో అతడ్ని ఊరిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతను మాటల మధ్యలో చంపిన మహిళల పేర్లు మరోసారి ప్రస్తావించాడు. దీంతో అతను చెబుతున్న మహిళలం తామేనంటూ ముందుకు వచ్చారు. దీంతో ఆ ఊరుకు చెందిన ఎంపీపీ అతడి చెంప ఛెళ్లు మనిపించి, పోలీసులకు అతని తీరును వివరించారు. దీంతో పోలీసులు నవ్వుకుని, అతనికి తమదైన 'సత్కారం' చేయడానికి స్టేషన్ కు తీసుకువెళ్ళారు.

  • Loading...

More Telugu News