: హాస్టల్ విద్యార్థులకు ఇక పండుగే


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల రూపురేఖలు మార్చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ-హాస్టల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఈ విధానం ప్రకారం ప్రతి హాస్టల్ లో లాప్ టాప్, వెబ్ కెమేరా, బయోమెట్రిక్ విధానం, సరకుల లెక్కలు, విద్యార్థులు, సిబ్బంది హాజరు అన్ లైన్ లో జరుగుతాయని అన్నారు. హాస్టల్ లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, అవినీతిని అరికడతామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News