: నిరుపయోగంగా ఉన్న చట్టాలను తొలగిస్తాం: మోడీ


నిరుపయోగంగా ఉన్న చట్టాలను తొలగిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ, దేశంలో అవసరం లేని చట్టాలను తొలగించేందుకు కసరత్తు ప్రారంభించామని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి నిరుపయోగ చట్టాలను గుర్తించే పని ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. జన్ ధన్ యోజన కింద 4 కోట్ల మంది పేదలు ఖాతాలు తెరిచారని చెప్పిన ఆయన, బ్యాంకులు ధనికుల కోసమే కాకుండా, పేదలకు కూడా సేవలందించాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News