: బీటెక్ విద్యార్ధినిపై అత్యాచారం
రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న యువతి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నంలో ఉండగా, రాజీవ్ గృహకల్ప నివాస సముదాయం వద్ద ఆసుపత్రికి తీసుకెళ్తానని నమ్మించి నరేష్ అనే యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె విషయం కుటుంబ సభ్యులకు వెల్లడించింది. యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో, కేసు నమోదు చేసి, నరేష్ ని అరెస్టు చేశారు.