: ప్రధానితో నా బంధం పవిత్రమైంది, భావోద్వేగమైంది: రాజ్ నాథ్ సింగ్


ప్రధాని నరేంద్రమోడీకి, తనకు మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని, అలాగే చాలా లోతైనదని పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా హాని జరిగినా సరే తమ మధ్య బంధం మాత్రం చెక్కుచెదరదన్నారు. గత సంవత్సరంన్నర నుంచి తమ మధ్య రిలేషన్ పెరిగిందే కానీ తగ్గలేదన్నారు. కాగా, కేంద్ర కేబినెట్ పై మోడీ చూపుతున్న ప్రాధాన్యం చాలా సాధారణమైందని, కావాలనేమి చేయడం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News