: సుబ్రహ్మణ్యస్వామిపై మరో రెండు పరువునష్టం కేసులు
బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామిపై తాజాగా మరో రెండు పరువునష్టం కేసులు దాఖలయ్యాయి. ట్విట్టర్ లో తనపై ఈ నెల 20న స్వామి చేసిన వ్యాఖ్యలకు గానూ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ కేసులు దాఖలు చేసినట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాసిన లేఖలో తనపై స్వామి పలు విమర్శలు, ఆరోపణలు చేసినందుకు గానూ జయ పరువునష్టం కేసు వేశారు. ఇందుకు కోర్టు ఆయనకు సమన్లు కూడా జారీ చేసింది.