: కేసీఆర్ నిర్ణయాలకు కోర్టులు ఐదు సార్లు తలంటాయి: లక్షణ్
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతోందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు న్యాయస్థానాలు ఐదు సార్లు తలంటాయని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఒంటెత్తు పోకడలను మానుకోవాలని ఆయన సూచించారు. భేషజాలకు, పంతాలకు పోకుండా స్థానికత అంశాన్ని భారత రాజ్యాంగం సూచించిన ప్రకారం ఉంచాలని ఆయన సూచించారు. భారతీయులెవరైనా భారతదేశంలో ఎక్కడైనా నివసించే అధికారం, హక్కు కలిగి ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఫాస్ట్ పధకానికి స్పష్టతనిచ్చి విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడకుండా చూడాలని ఆయన కోరారు.