: గౌతీ నాయకత్వానికి సలాం చేస్తున్న వసీం అక్రం


కోల్ కతా నైట్ రైడర్స్ సారథి గౌతమ్ గంభీర్ పై ఆ జట్టు బౌలింగ్ కోచ్ వసీం అక్రం ప్రశంసల జల్లు కురిపించాడు. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో జట్టు విజయాలకు గౌతీ నాయకత్వం కారణమన్నాడు. అంతేగాకుండా, జట్టు సభ్యుల మధ్య అనుబంధం కూడా లాభించిందని తెలిపాడు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, "ఏ జట్టు విజయంలోనైనా కెప్టెన్ కే తొలి క్రెడిట్ ఇవ్వాలి. కేకేఆర్ జట్టుకు సంబంధించి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇదో కుటుంబం లాంటిది. మేనేజర్ కానివ్వండి, ఇతర సిబ్బంది కానివ్వండి.. అందరూ ఇందులో భాగమే. అందరం ఒకరి సాహచర్యాన్ని మరొకరం ఆస్వాదిస్తాం" అని తెలిపాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రేపు హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో పెర్త్ స్కార్చర్స్ తో తలపడనుంది. ఇప్పటివరకు తానాడిన రెండు మ్యాచ్ లలోనూ గంభీర్ సేన విజయం సాధించింది.

  • Loading...

More Telugu News