: 'ఆగడు' పాటకు స్టెప్పేసిన మహేష్ బాబు కుమార్తె సితార
మహేష్ బాబు ముద్దుల తనయ సితార తన తండ్రి పాటకు డ్యాన్స్ చేసింది. 'ఆగడు' సినిమాలో 'నువ్వు ఆజా సరోజా' పాటకు సితార స్టెప్పేయగా, దాని తాలూకు వీడియో మహేష్ బాబు అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. 2012 జూలై 20న జన్మించిన సితార అంటే మహేష్ బాబు కుటుంబ సభ్యులకు చాలా ఇష్టం. మహేష్ బాబు సితారను తమ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తాడు. రెండేళ్ల సితార చేసే అల్లరిని కుటుంబ సభ్యులంతా తెగ ఎంజాయ్ చేస్తారు. సితార ఎప్పుడైనా ఊరెళ్తే ఇల్లు మూగబోతుందట. కుటుంబ సభ్యుల్లో ఆనందం కనబడదు. ఇప్పటికే సితార అన్న గౌతమ్ కృష్ణ 'వన్-నేనొక్కడినే' సినిమాతో రంగ ప్రవేశం చేయగా, సితార వీడియోలో కనిపించేసింది. మరి భవిష్యత్ లో నటిస్తుందో లేదో చూడాలి!