: పుట్టాడు, ట్విట్టర్లో అకౌంట్ తెరిచాడు!
భారత్ లోనూ పేరు తెచ్చుకున్న పాకిస్థానీ నటి వీణా మాలిక్ తల్లయిన సంగతి తెలిసిందే. మగశిశువు జన్మించగా అబ్రామ్ ఖాన్ అని నామకరణం చేశారు వీణా, ఆమె భర్త అసద్. అలా పుట్టాడో లేదో అతని పేరిట మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఓ అకౌంట్ ఓపెన్ అయింది. AbramKhan@iAbramKhan ఐడీతో ప్రారంభమైన ఈ అకౌంట్లోకి వెళితే... తండ్రి అసద్ చేతుల్లో ఉన్న చిట్టి అబ్రామ్ దర్శనమిస్తాడు. ఈ ప్రపంచంలోకి తనకు తానే స్వాగతించుకున్నట్టుగా ఫొటోకు క్యాప్షన్ కూడా జత చేశారు. ఇప్పుడే ట్విట్టర్ అకౌంట్ సెట్ చేశానని కూడా అబ్రామ్ పేరిట ట్వీట్ వెలువడింది.