: కొలిక్కి వచ్చిన బీజేపీ-శివసేన సీట్ల సర్దుబాటు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు సమస్య పరిష్కారమైంది. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య నెలకొన్న వివాదం సమసింది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గానూ శివసేన 151, బీజేపీ 130 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మిగతా ఏడు స్థానాల్లో కూటమిలోని ఇతర పార్టీలు పోటీ చేస్తాయి. ఒకవేళ బీజేపీ-శివసేన కూటమి ఎన్నికల్లో గెలుపొందితే తమకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరినట్లు సమాచారం.