: అగస్టా వెస్ట్ ల్యాండ్ ఛాపర్ స్కాం కేసులో తొలి అరెస్టు


అగస్టా వెస్ట్ ల్యాండ్ ఛాపర్ స్కాం కేసులో వ్యాపార వేత్త గౌతమ్ ఖైతాన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా... మనీ లాండరింగ్ అంశంపై విచారణ క్రమంలో తొలి అరెస్టు ఇదే. నిన్ననే (సోమవారం) ఢిల్లీలో ఖైతాన్ కు చెందిన రెండు చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఈ క్రమంలో నేడు అదుపులోకి తీసుకుంది. ఈ స్కాంకు సంబంధించి జులైలో నమోదైన క్రిమినల్ కేసులో 21 సంస్థల పేర్లు ఉన్నాయి. అందులో చండీగఢ్ కు చెందిన ఎయిరో మ్యాట్రిక్స్ కంపెనీ బోర్డులో ఖైతాన్ సభ్యుడిగా ఉన్నారు. వీవీఐపీల కోసం ఉపయోగించే హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో రూ.3,600 కోట్ల స్కాం జరిగినట్లు యూపీఏ-2 హయాంలో వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News