: 'గర్బా' వేడుకల్లో ముస్లింలు పాల్గొనాలంటే ఆవు మూత్రం రుచిచూడాల్సిందే: హిందూ ఉత్సవ్ సమితి తీర్మానం


మధ్యప్రదేశ్ లో హిందూ ఉత్సవ్ సమితి తాజా సమావేశం సందర్బంగా పలు తీర్మానాలు చేశారు. ఈ భేటీలో బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ, సమితి ముఖ్యులు, ముస్లిం మినహా ఇతర మతాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు. ముస్లింలు 'గర్బా' పేరిట జరిగే నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలంటే, కచ్చితంగా గో మూత్రం రుచి చూడాల్సి ఉంటుందని తీర్మానం చేశారు. అలా రుచి చూసిన వారినే 'గర్బా' వేడుకల్లోకి అనుమతించాలని సూచించారు. అంతేగాకుండా, ఈ వేడుకలకు హాజరయ్యే ముస్లిం పురుషులు వారి మహిళలను కూడా తీసుకుని రావాలని శర్మ తెలిపారు. శర్మ భోపాల్లోని హుజూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 'గర్బా' అంటే దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్త్రీపురుషులు పాల్గొనే ఓ నృత్య కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది ప్రాచుర్యంలో ఉంది.

  • Loading...

More Telugu News