: దర్శకుడు బాపు పుట్టిన ఊర్లో విగ్రహం ఏర్పాటు చేస్తున్న 'తానా'


ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు పుట్టిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తెలిపింది. డిసెంబర్ 15న ఆయన పుట్టిన రోజు నాడు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. అదే సమయంలో తానా నిర్వహించే చైతన్య స్రవంతి వేడుకల్లో బాపు బొమ్మల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు కళారంగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) ప్రస్తుతం లేకపోయినా, ఆయన ప్రతిభను రేపటితరం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తానా తెలిపింది. బాపుకు తానాతో ఉన్న అనుబంధం మరచిపోలేనిదని పేర్కొంది.

  • Loading...

More Telugu News