: 'హలో' అంటే 'హలో'... సైనాతో సింధు స్నేహం అంతవరకేనట!


భారత బ్యాడ్మింటన్ రంగంలో ఆశాకిరణం, తెలుగుతేజం పుసర్ల వెంకట సింధు మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ తనకు స్నేహితురాలేమీ కాదని, 'హలో' అంటే 'హలో' అనుకుంటామని, తమ స్నేహం అంతవరకేనని స్పష్టం చేసింది. హైదరాబాదుకే చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి తనకు మంచి మిత్రురాలని సింధు తెలిపింది. ఏ విషయమైనా ఆమెతో పంచుకుంటానని చెప్పింది. ఇక, ప్రేమ విషయానికొస్తూ, తనకెవరూ బాయ్ ఫ్రెండ్ లేరని, నేటి వరకు ప్రేమలో పడలేదని తెలిపింది. కాగా, సింధు బ్యాడ్మింటన్ కారణంగా సొంత అక్క పెళ్ళిని కూడా మిస్సయిందట. అక్క వివాహం సమయానికి తాను లక్నో గ్రాండ్ ప్రీ టోర్నీలో పాల్గొనాల్సి వచ్చిందని ఈ పొడగరి వివరించింది. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న సింధు తల్లిదండ్రులు కూడా క్రీడాకారులే. తండ్రి వెంకటరమణ, తల్లి విజయ ఇద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. వెంకటరమణకు 2000లో అర్జున అవార్డు కూడా లభించింది. తల్లిదండ్రుల బాటలో కాకుండా సింధు బ్యాడ్మింటన్ ఎంచుకుంది.

  • Loading...

More Telugu News