: అస్సాం, మేఘాలయలో భారీ వరదలు
జమ్మూ కాశ్మీర్ తరువాత ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 48 గంటల నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటివరకు పదిమంది చనిపోగా, వేలాదిమంది ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నారు. భారీ వర్షాలతో వంద గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఏర్పడగా, లక్ష మంది ప్రజలు ప్రభావితమయ్యారని స్థానిక డిప్యూటీ కమిషనర్ తెలిపారు. మేఘాలయలోని పలు ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. రెండు రాష్ట్రాల సీఎంలు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.