: ముస్లిం మహిళలకు కూడా త్వరలో 'కల్యాణ లక్ష్మి' పథకం వర్తింపు
'కల్యాణ లక్ష్మి' పథకాన్ని ఈ దసరా నుంచి ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దళిత, గిరిజన కుటుంబాల్లోని పేద అమ్మాయిల వివాహానికి ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో కేసీఆర్ ఈ 'కల్యాణ లక్ష్మి' పథకానికి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా దళిత, గిరిజన కుటుంబాల్లోని అమ్మాయిలకు 18 ఏళ్లు నిండాక... పెళ్లి కుదిరితే రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ విషయమై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రతీ జిల్లాలో మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ఏదో ఒక జిల్లాలో తాను స్వయంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని కేసీఆర్ సమావేశంలో చెప్పారు. అతి త్వరలో, ముస్లిం వధువులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కేసీఆర్ ప్రకటించారు.