: టీచర్ ను కొరికాడని, చిన్నారిని కొరికిన మరో టీచర్!
అమెరికాలోని వాషింగ్టన్ శివార్లలోని ఓ ప్రీస్కూల్లో చిన్నారిని టీచర్ కొరికిన ఘటన వెలుగులోకి వచ్చింది. వుడ్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్న గొడ్డార్డ్ స్కూల్లో 13 నెలల చిన్నారి ప్రీస్కూలింగ్ చేస్తున్నాడు. సెప్టెంబరు 11న ఆ అబ్బాయి స్కూల్లో ఓ టీచర్ ను కొరికాడు. ఇది చూసిన మరో టీచర్ థెరెసా బ్రౌన్ కు ఒళ్ళు మండిపోయింది. వెంటనే ఆ చిన్నారి భుజంపై కసిదీరా కొరికింది. ఈ ఘటనను చూసిన ఓ వ్యక్తి స్కూల్ సహ యజమాని నదియా చౌధరికి సమాచారమందించగా, ఆమె గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు థెరెసా బ్రౌన్ ను అరెస్టు చేశారు. ఘటనపై ఫిర్యాదు చేయనందుకు నదియాపైనా కేసు నమోదు చేశారు. ఇక, స్కూల్ యాజమాన్యం థెరెసా బ్రౌన్ ను విధుల నుంచి తొలగించింది.