: 'లవ్ జీహాద్'పై ఏబీవీపీ జనజాగృత కార్యక్రమాలు


హిందూ యువతులను పెళ్లాడుతున్న ముస్లిం యువకులు, అనంతరం వారిని ఇస్లాంలోకి మారుస్తున్న మోసపూరిత వ్యవహారాలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జన జాగృత కార్యక్రమాలకు తెరలేపనుంది. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ చెప్పారు. ‘‘దీనిని మీరు లవ్ జీహాద్ అనైనా పిలవండి. మరే పేరుతోనైనా పిలవండి. కొందరు ముస్లిం యువకులు తమ మతాన్ని దాచిపెట్టి హిందూ యువతులను పెళ్లాడుతున్నారు. ఈ తరహా ఘటనలు వందల సంఖ్యలో మా దృష్టికి వచ్చాయి. దీని వెనుక పెద్ద కుట్ర దాగుందని భావిస్తున్నాం’’అని ఆయన పేర్కొన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈ వ్యవహారాలపై విద్యార్థులను జాగృతం చేసేందుకే ఈ కార్యక్రమాల నిర్వహణకు పూనుకున్నామని మనోహర్ చెప్పారు.

  • Loading...

More Telugu News