: ఇక కాంగ్రెస్, ఎన్సీపీల వంతు!


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై నిత్యం అగ్గి రాజేస్తున్నాయి. శివసేన, బీజేపీల మధ్య నెలకొన్న సీట్ల తకరారు ఇంకా సమసిపోలేదు, తాజాగా ఇదే విషయంపై కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య వాతావరణం వేడెక్కింది. ఎన్నికల్లో భాగంగా సీట్ల పంపకంపై సోమవారం న్యూఢిల్లీలో భేటీ అయిన రెండు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో నేడు ముంబైలో మరోమారు మంతనాలు సాగించనున్నారు. పొత్తులో భాగంగా ఈ దఫా సగం సీట్లను తమకు కేటాయించాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ తో పొత్తును తెంచుకునేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సిద్ధంగా లేనప్పటికీ, ఆయన అల్లుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాత్రం పార్టీని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని తలపోస్తున్నారు. ఇందులో భాగంగా శివసేనను వీడితే, బీజేపీతోనూ కలిసేందుకు ఆయన వెనుకాడటం లేదని తెలుస్తోంది. మరి ముంబైలో జరిగే నేటి భేటీ, ఇరు పార్టీల బంధాలను మరింత బలోపేతం చేస్తుందో, లేక ఏళ్లుగా కొనసాగుతున్న బంధాలను తెంచుతుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

  • Loading...

More Telugu News