: రెండు ఫొటోలుంటే చాలు...బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు
బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు ఇబ్బంది పడుతున్నారా? బ్యాంకు సిబ్బంది అడుగుతున్న అధికారిక గుర్తింపు ప్రతాలు, ఆధార్ కార్డు నెంబర్లు లేవని చింతిస్తున్నారా? ఇక ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలం రెండు ఫొటోలతో బ్యాంకు శాఖ వద్దకెళితే, ఇట్టే బ్యాంకు ఖాతా వచ్చేస్తుంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గత నెలలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఎలాంటి గుర్తింపు కార్డులు లేకున్నా, రెండు ఫొటోలతో వచ్చే వ్యక్తులకు బ్యాంకులు ఖాతాలను జారీ చేయాల్సిందే. అయితే ఎడాది పాటు నిలిచి ఉండే ఈ ఖాతాకు కొన్ని పరిమితులున్నాయి. నెలకు రూ. 50 వేలకు మించిన నగదు నిల్వలను బ్యాంకులు అనుమతించవు. నెలకు రూ. 10 వేల కంటే అధిక మొత్తం విత్ డ్రా కూడా కుదరదు. ఏడాదిలో మొత్తం రుణ పరిమితి రూ.1 లక్ష మించి అనుమతించదు. 12 నెలల్లోగా ఏదేనీ గుర్తింపు కార్డును సమర్పించి, ఖాతాను సాధారణ ఖాతాగా మార్చుకోవచ్చు.