: ఇక ముంబైలో మహిళా ట్యాక్సీ డ్రైవర్లు!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇకపై మహిళా ట్యాక్సీ డ్రైవర్లు మనకు సేవలందించనున్నారు. ముంబై మహా నగరంలో ట్యాక్సీ డ్రైవర్ లైసెన్సుల జారీకి మహారాష్ట్ర రవాణా శాఖ జారీ చేసిన ప్రకటనకు మహిళల నుంచి భారీ స్పందన లభించింది. స్వల్ప కాలంలోనే 221 మంది మహిళలు ట్యాక్సీ డ్రైవర్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక తామేమీ తక్కువ తినలేదంటూ ముగ్గురు ట్రాన్స్ జెండర్లు కూడా ట్యాక్సీ డ్రైవర్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వీరికి లైెసెన్సు లభిస్తుందా? లేదా? అన్న విషయం అక్టోబర్ 10న జరగనన్న లాటరీలో కాని తేలదు. అసంఘటిత రంగంలో మహిళలు రాణించడం కష్టసాధ్యమైన పనే అయినప్పటికీ అసాధ్యమేమీ కాదుగా? అంటూ ఆ రాష్ట్ర రవాణా శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.