: ఇన్ఫోసిస్ ఉన్నతోద్యోగుల వేతనాల్లో భారీ పెరుగుదల!
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉన్నతోద్యోగుల వేతనాలు ఒకేసారి మూడు నుంచి ఐదు రెట్ల మేర పెరిగాయి. ఇప్పటికే రూ.30 కోట్ల వార్షిక వేతనంతో కంపెనీ సీఈఓ విశాల్ శిఖా, దేశంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓగా కొనసాగుతున్నారు. సంస్థలో ఆయన తర్వాతి స్థానాల్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ హోదా ఉద్యోగుల వేతనాలు, శిఖా వేతనం కంటే చాలా తక్కువగా వున్నాయి. ఈ వ్యత్యాసాన్ని తగ్గించే క్రమంలో ఇన్ఫోసిస్ తాజాగా ఉన్నతోద్యోగుల వేతనాల పెంపునకు శ్రీకారం చుట్టింది. తాజా పెంపుతో సంస్థలో పలువురు వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగుల వేతనాల్లో ఒకేసారి భారీ పెరుగుదల నమోదైంది. భారత్ లోకి పెద్ద సంఖ్యలో ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ప్రవేశిస్తున్న తరుణంలో ఆయా సంస్థలు తమ నాణ్యమైన సిబ్బందిని నిలుపుకునేందుకు ఈ మేర సాహసం చేయకతప్పదని మార్కెట్ విశ్లేషణలు సాగుతున్నాయి.