: రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద జోకర్: కాంగ్రెస్ నేత ముస్తఫా


మామూలుగా తమ పార్టీ సీనియర్లపై విమర్శలు చేస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏమైపోతుందోనని భయపడతారు. అందుకే ప్రాంతీయ పార్టీల నేతలు సీనియర్లను విమర్శించాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. పోనీ, జాతీయ పార్టీ బీజేపీలోనైనా సీనియర్లను విమర్శిచే ధైర్యం ఎవరైనా చేయగలరా, అంటే అంత ధైర్యం ఎవరికీ లేదంటారు. అదే కాంగ్రెస్ పార్టీలోనైతే సీనియర్లనేం ఖర్మ... ఏకంగా పార్టీ అధినాయకత్వాన్ని కూడా ఏకిపడేయొచ్చు అనడానికి నిదర్శనమైన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టీహెచ్ ముస్తఫా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద జోకర్ అని అన్నారు. పార్టీ నుంచి బయటకు విసిరేసిన నేత రాహుల్ గాంధీ అని ఆయన దుయ్యబట్టారు. ప్రధాని మోడీని ముస్తఫా కొనియాడారు. కాశ్మీర్ వరదలను ఎదుర్కోవడంలో, ఇరాక్ లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకురావడంలో మోడీ చూపిన ఆత్మస్థైర్యం తిరుగులేనిదని ఆయన కొనియాడారు.

  • Loading...

More Telugu News