: 3 కోట్లు రెడీ చేయండి...లేదా...! : శిల్పాశెట్టి దంపతులకు బెదిరింపు


ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రా, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. గత రెండు నెలలుగా బాలీవుడ్ నటీనటులకు మాఫియా గ్యాంగ్ స్టర్ రవి పుజారి పేరిట బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. షారూఖ్ ఖాన్, సోనూ సూద్, బొమన్ ఇరానీలకు రవి పుజారి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. వాటిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా శిల్పా శెట్టి దంపతులకు గుర్తు తెలియని ఆగంతుకుడు, తాను రవి పుజారినని... వెంటనే మూడు కోట్ల రూపాయలు సిద్ధం చేయాలని... లేని పక్షంలో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజ్ కుంద్రాకు వచ్చిన ఫోన్ కాల్ పై దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News