: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోకు పూర్తిగా సహకరిస్తోంది: కేంద్రానికి రాజీవ్ శర్మ నివేదన
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణంపై రేగిన వివాదం ఢిల్లీ వరకు పాకింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు ఢిల్లీలోని కేబినెట్ సెక్రటరీ, ప్రధాని ముఖ్య కార్యదర్శిని కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాదు మెట్రో రైల్ నిర్మాణ ప్రగతిని వారికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోకు పూర్తిగా సహకరిస్తోందని, ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ కంపెనీకి మధ్య సమస్యలు లేవని వారు ప్రధాని ముఖ్య కార్యదర్శికి వివరించారు.