: దసరా, బతుకమ్మ పండుగ ఎఫెక్ట్... తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త


ప్రభుత్వోద్యోగులకు జీతాలు సాధారణంగా నెల ప్రారంభమైన మొదటి వారంలో అందుతుంటాయి. కొన్నిసార్లు 1వ తారీఖునే అందుతూ ఆనందాశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఈసారి అంతకంటే విశేషం చోటుచేసుకోనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులందరికీ ఈ నెల 28న జీతాలు అందనున్నాయి. దసరా, బతుకమ్మ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని రెండు రోజులు ముందుగా జీతాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News