: తాగుడుకు బానిసైన భర్తకు తగిన శాస్తి చేసిన భార్య
తాగుడుకు బానిసైన భర్త తీరుపై విసిగి వేసారిన అతని భార్య తగిన శాస్తి చేసింది. కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని పొన్నాపురంలోని మహిళకు ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తితో పెళ్లయింది. వీరు పొన్నాపురంలో ఇటుక కార్మికులుగా పొట్టపోసుకుంటుండగా, వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బండెడు సంతానాన్ని కన్న అతను, కుటుంబ పోషణ గాలికి వదిలేసి అందినకాడికి అప్పులు చేస్తూ తాగుడుకి బానిసయ్యాడు. ఎప్పట్లాగే నిన్న అతను పూటుగా తాగేసి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అతని తీరుతో విసిగిపోయి ఉన్న భార్య బ్లేడ్ తో అతని పురుషాంగం కోసేసింది. జరిగిన దారుణంతో తేరుకున్న అతను ఓ వైద్యుడి వద్దకు వెళ్లాడు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.