: ఫేస్ బుక్ లో సెల్ఫీలు షేర్ చేస్తున్నారా?
యూత్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు సామాజిక అనుసంధాన మాధ్యమాల్లో సెల్ఫీలే సెల్ఫీలు. ఇలా సెల్ఫీలు ఎక్కువగా చేసే వారిపై ఓ సంస్థ అధ్యయనం నిర్వహించింది. దానిలో తేలిన విశేషాలేంటంటే... ఎక్కువగా సెల్ఫీలను షేర్ చేస్తే స్నేహితులు, బంధువులతో సంబంధాలు దెబ్బతింటాయని సర్వే వెల్లడించింది. అలాగే స్నేహితుల నుంచి లైక్స్ కూడా తగ్గుతాయని సర్వే వివరించింది. అదీకాక ఇలా సెల్ఫీలు అధికంగా పెట్టేవారి పట్ల చూసేవారికి నెగిటివ్ దృక్పధం ఏర్పడుతుందని సర్వే తెలిపింది. కనుక సెల్ఫీలు పెట్టేప్పుడు ఓ సారి ఆలోచించండి.