: ప్రభుత్వమే పూచీకత్తు... బ్యాంకుల హర్షం: ఈటెల
రైతు రుణామాఫీకి ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుందని చెబితే బ్యాంకులు హర్షం వ్యక్తం చేశాయని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మంత్రి వర్గ ఉపసంఘం చాలా వేగంగా చర్చలు జరిపి రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని అన్నారు. రేపు రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చిస్తామని ఆయన వెల్లడించారు. రుణమాఫీ ఎంత కష్టమైనా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రైతాంగం కోసం భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు చేపడతామని ఆయన చెప్పారు.