: నాలుగు విడతలుగా రుణమాఫీ అమలు చేస్తాం: పోచారం
రైతు రుణమాఫీ నిధులను బ్యాంకులకు నాలుగు విడతలుగా విడుదల చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతు రుణమాఫీని తక్షణం అమలు చేసి, రైతులకు ఖరీఫ్ రుణాలు అందేలా చూస్తామని అన్నారు. రేపు బ్యాంకర్లతో జరిగే చర్చల్లో రైతులకు రుణాలు అందజేయడం, పాత రుణాలు మాఫీ చేయడంపై సమగ్రంగా చర్చిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని ఆయన చెప్పారు.