: 'టీమ్ ఇండియా'లో రోజర్ ఫెదరర్


టెన్నిస్ ఆల్ టైం గ్రేట్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో టీమ్ ఇండియా తరపున ఆడనున్నాడు. భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి మానస పుత్రికే ఈ ఐపీటీఎల్. వరల్డ్ స్టార్లను ఈ లీగ్ లో ఆడేందుకు ఒప్పించడంలో భూపతి సఫలమయ్యాడు. దీంతో, టోర్నీకి ఆకర్షణ పెరిగింది. తాను ఈ లీగ్ లో పాల్గొంటున్నట్టు స్విట్జర్లాండ్ స్టార్ ఫెదరర్... భూపతికి ట్వీట్ చేశాడు. ఈ లీగ్ లో భారత్ తరపున బరిలో దిగే టీమ్ ఇండియాలో లెజెండరీ క్రీడాకారుడు పీట్ సంప్రాస్, గేల్ మోన్ ఫిల్స్, అనా ఇవనోవిచ్, సానియా మీర్జా, రోహన్ బోపన్న కూడా ఉన్నారు. కాగా, రఫెల్ నడాల్ గాయంతో తప్పుకుంటున్నట్టు ప్రకటించి లీగ్ నిర్వాహకులను నిరాశకు గురిచేశాడు. ఇక, ఈ లీగ్ లో ఫిలిప్పీన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇతర జట్లు. పురుషుల ప్రపంచ నెంబర్ వన్ నోవాక్ జొకోవిచ్, మహిళల టాపర్ సెరెనా విలియమ్స్, మాజీ నెంబర్ వన్ మరియా షరపోవా, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే, భారీకాయుడు జో విల్ ఫ్రెడ్ సోంగా, కరోలినా వోజ్నియాకి తాము ఈ టోర్నీలో పాల్గొంటున్నట్టు స్పష్టం చేశారు. ఈ టోర్నీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13 వరకు జరుగుతుంది. ఈ పోటీలు ఫిలిప్పీన్స్ లో ఆరంభమై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ముగుస్తాయి.

  • Loading...

More Telugu News