: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 'ఫాస్ట్' జీవోపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 'ఫాస్ట్' జీవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా జీవో ఉందని మండిపడింది. తెలంగాణ ప్రత్యేకంగా ఎక్కడో లేదని, భారత్ లోనే అంతర్భాగమని కోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని రోజుల కిందట 'ఫాస్ట్' జీవోను సవాల్ చేస్తూ మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, పితాని సత్యనారాయణ హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఫాస్ట్ జీవో రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. మరోమారు ఈ విషయంపై పునఃపరిశీలించాలని కూడా చెప్పింది. ఈ క్రమంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఆరు వారాలకు తదుపరి విచారణ వాయిదా వేసింది. 1956 నవంబర్ 1 నాటికి తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకే ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించినదే ఈ 'ఫాస్ట్' జీవో!