: దీపికా పదుకునే, టైమ్స్ ఆఫ్ ఇండియా వివాదం ముదురుతోంది!
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే, ఆంగ్ల దిన ప్రతిక టైమ్స్ ఆఫ్ ఇండియా మధ్య వివాదం రోజురోజుకీ ముదురుతోంది. కొద్ది రోజుల క్రితం 'ఫైండింగ్ ఫానీ' సినిమా ప్రమోషన్ లో దీపికా పదుకునే వక్షోజ ప్రదర్శన చేసిందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఓ కథనం ప్రచురించింది. సినిమాలో సన్నివేశం డిమాండ్ చేసిందంటూ అంగాంగ ప్రదర్శన చేసే సినీ తారలు, ప్రమోషన్ లో కూడా అందాల ప్రదర్శన చేస్తున్నారంటూ ఆ కథనం సాగింది. దీనిపై దీపికా పదుకునే తాచులా బుసలు కొట్టింది. 'నేను మహిళను, నాకు వక్షోజాలు ఉన్నాయి, ప్రదర్శిస్తాను, మీకొచ్చిన ఇబ్బందేమిటి? మహిళను గౌరవించడం రాకపోతే మహిళా చైతన్యం అంటూ రాతలు రాయకండి' అంటూ ఫైర్ అయిపోయింది. దీనికి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా మద్దతు పలికాడు. దీంతో, టైమ్స్ ఆఫ్ ఇండియా... ప్రమోషన్ కార్యక్రమం పేరిట డ్యాన్సులు, అంగాంగ ప్రదర్శనలను ఏ సిట్చుయేషన్ డిమాండ్ చేసింది? అంటూ దీటుగా ప్రశ్నించింది. దీనికి రిటార్ట్ గా దీపికా, 'నా ప్రొఫెషన్ నాకు కొత్త కాదు, పాత్రల డిమాండ్ మేరకు నడుచుకుంటాను, ఒక్కోసారి పూర్తిగా దుస్తులు ధరించాల్సి రావచ్చు, లేదా, నగ్నంగా నటించాల్సి రావచ్చు, అయితే, ఆ పాత్రలు ధరించాలా? వద్దా? అనేది నా ఇష్టం. పాఠకుల కోసం ఇష్టానుసారం రాయవద్దు' అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. దీనిపై తామేమీ కొత్తగా కల్పించి కథనాలు రాయడం లేదని, సినీ తారలు ఏం చేస్తున్నారో అదే లోకానికి చెబుతున్నామని ఆ పత్రిక స్పష్టం చేసింది. 'గతంలో ఇతర మీడియా సంస్థలు నీ వక్షోజాలతో ఫోటోలు పోస్టు చేశాయి. వాటిపై లేని అభ్యంతరం టైమ్స్ ఆఫ్ ఇండియా రాస్తే మాత్రమే ఎందుకు వచ్చింద'ని పత్రిక ప్రశ్నించింది. 'అలాగే యూట్యూబ్ లో ఉన్న మీ వీడియోల గురించి కూడా స్పందించండి' అంటూ నిలదీసింది. ఏదేమైనా ఈ వివాదం దీపిక సినిమా ప్రమోషన్ కు బాగా ఉపయోగపడిందని సదరు పత్రికా సంస్థ పేర్కొంది.