: వారు గెంటేశారు... వీరు అదుపులోకి తీసుకున్నారు!


నిషిద్ధ వస్తువులు కలిగి ఉన్నారంటూ కాంబోడియాలో ఇద్దరు బౌద్ధ భిక్షువులను ఆశ్రమం నుంచి గెంటేశారు. అనంతరం, వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పుర్ లంగా పగోడాకు చెందిన సియెమో రీప్ నగరంలో బౌద్ధ బిక్షువులుగా ఉంటూ తప్పుదారిపట్టారంటూ పిచ్ డేవిడ్ (36), మరో జూనియర్ బౌద్ధ భిక్షువును మతపెద్దలు బౌద్ధం నుంచి బహిష్కరించగా, వారిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద మద్యం సీసాలు, కండోమ్ లు, ఐస్ అనే మాదకద్రవ్యం సేవించేందుకు అవసరమైన సరంజామా లభ్యమయ్యాయి. దీంతో, బౌద్ధ మతపెద్దలు వారికి మతబహిష్కరణ విధించారు. గతంలో ఓసారి పిచ్ డేవిడ్ ను ఇలాగే గెంటేయగా, మరే తప్పు చేయనని మత పెద్దలను బతిమాలుకుని ఆశ్రమంలో చేరాడు. మరోసారి అలాంటి తప్పే చేయడంతో అతనిని మతం నుంచి బహిష్కరించారు. గతంలో పోలీసులతో కలిసి మద్యం సేవించాడని ఓ సాధువును మతం నుంచి వెలివేశారు. బౌద్ధమత నియమావళిలో వ్యసనాలు, కోరికలు కచ్చితంగా త్యజించాలి. లేని పక్షంలో వారిని భిక్షువులుగా పరిగణించరు.

  • Loading...

More Telugu News