: బీజేపీ ఎంపీ ఇంటిపై రాళ్లు విసిరిన వరుణ్ గాంధీ మద్దతుదారులు


బీజేపీ అలహాబాద్ ఎంపీ శ్యామచరణ్ గుప్తా ఇంటిపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మద్దతుదారులు రాళ్లు విసిరారు. వరుణ్ తల్లి, కేంద్రమంత్రి మేనకా గాంధీపై గుప్తా చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ఈ రాళ్ళ దాడి చేశారు. గత నెలలో ఓ బహిరంగ సభలో మాట్లాడిన మేనక, ఉత్తరప్రదేశ్ కు తన కుమారుడు వరుణ్ గాంధీ ఉత్తమ ముఖ్యమంత్రి కాగలడని, ఆ రాష్ట్రాన్ని సరైన మార్గంలో పాలించగలడని అన్నారు. ఇందుకు మండిపడ్డ ఎంపీ శ్యామచరణ్ గుప్తా, యూపీకి వరుణ్ ను సీఎం చేసేందుకు మేనక ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంత తొందరపాటుగా మాట్లాడటం సరికాదన్నారు. భవిష్యత్తులో మేనకలాగే మిగతా నేతలు కూడా తమ పిల్లల గురించి ఇలాగే మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ఈ మాటలకు కోపోద్రిక్తులైన వరుణ్ అనుచరులు ఎంపీ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు.

  • Loading...

More Telugu News