: టెక్నాలజీకి అంతుబట్టని నరైన్ బౌలింగ్!


వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి స్పిన్నర్ సునీల్ నరైన్ గొప్పదనమేంటో అతన్నెదుర్కొన్న బ్యాట్స్ మెన్ ను అడిగితే చెబుతారు. దూస్రాలను మించిన డెలివరీలతో మేటి బ్యాట్స్ మెన్ కు సైతం ముకుతాడు వేయడం ఈ యువకుడికే చెల్లింది. క్యారమ్ బాల్ అస్త్రానికి మరిన్ని మెరుగులు దిద్దిన నరైన్, ఇప్పుడు హార్డ్ హిట్టర్ల పాలిట యముడయ్యాడు. వేలికొసలతో బంతి గమనాన్ని నిర్దేశించడం నరైన్ స్పెషాలిటీ. అతని బౌలింగ్ లోని వైవిధ్యాన్ని లేటెస్ట్ టెక్నాలజీ సైతం విశ్లేషించలేకపోతోంది. మామూలుగా వేళ్ళసాయంతో బంతిని తిప్పడం స్పిన్నర్లందరూ చేసేదే. కానీ, నరైన్ స్టయిలే వేరు. వేలికొసలతో అనూహ్యంగా బంతిని టాప్ స్పిన్ చేస్తాడు. దీంతో, బ్యాట్స్ మెన్ అయోమయానికి గురవుతారు. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున సీఎల్ టి20 టోర్నీలో ఆడుతున్న నరైన్ ఇప్పటికే ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు. రెండు మ్యాచ్ లాడి 4 వికెట్లతో సత్తా చాటాడు. టి20 క్రికెట్లో మెయిడెన్ ఓవర్ విసరడం ఎంతో అరుదు, కాగా, నరైన్ బంతినందుకుంటే అలాంటి మెయిడెన్లు ఎన్నో వస్తాయి. లాహోర్ లయన్స్ తో మ్యాచ్ సందర్భంగా చివరి ఓవర్లలో మెయిడెన్ విసరడాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు నరైన్ స్థాయి ఏమిటన్నది.

  • Loading...

More Telugu News