: వాణిజ్య పంటలకూ రుణమాఫీ వర్తింపజేస్తాం: మంత్రి పుల్లారావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యాన పంటలు మినహా వాణిజ్య పంటలకూ రుణమాఫీ వర్తింపజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నెల 25లోపు బ్యాంకుల నుంచి పూర్తి జాబితాలు అందుతాయని చెప్పారు. తొలి విడతగా రూ.50 వేల చొప్పున బ్యాంకులకు చెల్లిస్తామన్నారు. దాంతో 40 శాతం రైతులు రుణ విముక్తులవుతారన్నారు.