: వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేస్తాడు: పరిటాల సునీత
తన కుమారుడు పరిటాల శ్రీరామ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తాడని ఏపీ మంత్రి పరిటాల సునీత చెప్పారు. పరిటాల కుటుంబం పేరుతో బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న శ్రీరామ్ అనంతపురం రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసి ఉంటే తన కుమారుడు పోటీ చేసేవాడని సునీత కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించడం తెలిసిందే. కానీ, బాబు ఆదేశాలతో ఇప్పుడే పోటీ చేయకూడదని వెనక్కి తగ్గినట్లు సమాచారం.