: తెలంగాణ రాష్ట్రంలో నంబర్ ప్లేట్ల రీ-రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే
తెలంగాణ రాష్ట్రంలో నంబర్ ప్లేట్ల రీ-రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జరిగిన విచారణలో, తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ల పేరిట పౌరులను ఎందుకు వేధిస్తున్నారు? అని ప్రశ్నించిన హైకోర్టు, తగిన చట్టాన్ని రూపొందించకుండా పాత రిజిస్ట్రేషన్లు ఎలా మారుస్తారని అడిగింది. అధికారం ఉంది కదా అని ఏమైనా చేయాలనుకుంటే సరికాదని వ్యాఖ్యానించింది.