: బీజేపీ-శివసేన కూటమిని విచ్ఛిన్నం చేయవద్దని అమిత్ షా విజ్ఞప్తి


ఇరవై ఐదేళ్ల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన బీజేపీ-శివసేన కూటమిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర విభేదాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. దాంతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వెంటనే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు ఫోన్ చేసి కూటమిని విచ్ఛిన్నం చేసేలా వ్యవహరించవద్దని కోరారు. సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇస్తామన్న 119 స్థానాల ప్రతిపాదన 'అసాధ్యమైనది' అనీ, ఆ విషయంలో మరోసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జ్ ఓం మాధుర్ ఈ రోజు ముంబయి చేరుకుని శివసేనతో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News