: 'చార్లీ' కథ సుఖాంతం... ఊపిరి పీల్చుకున్న పోలీసులు!
రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ పెంపుడు కుక్క 'చార్లీ' శనివారం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. దానిపై జైపూర్లోని సోడాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలవగా, పోలీసులు భారీ ఎత్తున వెదుకులాటకు ఉపక్రమించారు. కుక్క ఆచూకీ తెలిపిన వారికి రూ.10,000 రివార్డు కూడా ప్రకటించారు. కాగా, ఓ వ్యక్తి ఈ ఉదయం సదరు కుక్కను తీసుకువచ్చి మంత్రిగారి ఇంట్లో అప్పగించాడు. ఆదివారం నాడు తాను మార్నింగ్ వాక్ కు వెళుతుండగా, ఈ కుక్క కనిపించిందని తెలిపాడు. ఆ వ్యక్తి న్యూస్ పేపర్లో చూసి, ఈ శునకం మంత్రిగారిదని తెలుసుకున్నాడట. కుక్క దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.