: వీరప్ప మొయిలీ వివాదాస్పద వ్యాఖ్యలు


కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ వివాదానికి తెరలేపారు. 'హిందు' అన్న పదం కనిపెట్టింది ముస్లింలేనని వ్యాఖ్యానించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మధ్యయుగంలో ఇండియాలో నివసిస్తున్న ప్రజలను ముస్లింల నుంచి వేరు చేసి చూపేందుకు ఈ 'హిందు' అన్న పదాన్ని ఉపయోగించారని తెలిపారు. వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ 'హిందు' అన్న పదం ప్రస్తావనే లేదని అన్నారు. మొయిలీ చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ అభ్యంతరం చెప్పారు. మొయిలీ లాంటి వ్యక్తులు ఇలాంటి అంశాలను లేవనెత్తరాదని అభ్యర్థించారు. "మనం ప్రాచీన కాలం నాటి విషయాల జోలికి వెళ్ళడం ఎందుకు? ప్రస్తుతం ప్రశాంతంగా లేమా?" అంటూ హితవు చెప్పే ప్రయత్నం చేశారు. అటు, మొయిలీ వ్యాఖ్యలను శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ కూడా ఖండించారు.

  • Loading...

More Telugu News