: నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ
నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో ఈ తెల్లవారుజామున దోపిడీ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లో ఆరో నంబర్ ప్లాట్ ఫాంపై ట్రైన్ ఆగి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 30మందికి పైగా దొంగలు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దోచుకున్నారు. బాధితులు వెంటనే దోపిడీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.