: ఆసుపత్రిపాలైన బాలీవుడ్ నటుడు శశి కపూర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు శశి కపూర్ (76) ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా గత రాత్రి ఆయనను ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కపూర్ ఐసీయూలో వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారని, పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ నరైన్ తెలిపారు. 160కి పైగా హిందీ చిత్రాల్లో నటించిన శశి... 'దీవార్', 'సిల్ సిలా', 'సత్యం శివం సుందరం' సినిమాలతో సత్తా ఉన్న నటుడిగా పేరొందారు. గతంలో ఆయన బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు.