: బీజేపీలో చేరడానికి కిరణ్ కుమార్ రెడ్డి సుముఖత
మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడానికి సుముఖంగానే ఉన్నారని సమాచారం. అయితే, ఆ పార్టీలోకి వెళ్లడానికి ఆయన ఒక షరతు పెడుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనకు ఆహ్వానం అందాలని, ఆ తర్వాత తనకు పార్టీలో గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు. ఇటీవలే, అమెరికాలో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుని కిరణ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చిన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలను అధ్యయనం చేస్తోన్నట్టు సమాచారం.