: నాయిని పీర్ల పండుగలో బుడ్డర్ ఖాన్ లాంటి వ్యక్తి: రేవంత్ రెడ్డి
'మెట్రో'కు కేటాయించిన భూములను అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం వేరే సంస్థలకు అన్యాయంగా బదలాయించిందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో, ధైర్యముంటే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని ఫైళ్లను తమ ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై రేవంత్ స్పందించారు. నాయిని నర్సింహారెడ్డి పీర్ల పండుగలో బుడ్డర్ ఖాన్ (ఓ రకమైన పిట్టలదొర వేషం) లాంటివారని, ఆయనలా మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోలేనని ఆయన వ్యాఖ్యానించారు.