: ఊకే గిచ్చికయ్యం పెట్టుకుంటే, చేసుకున్న భార్య కూడ ఉండదురా చంద్రబాబో!: నాయిని


చంద్రబాబుకు ధైర్యముంటే తన పార్టీ 'చంచాగాళ్ల'తో మాట్లాడించడం కాకుండా, తానే స్వయంగా మాట్లాడాలని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సవాల్ విసిరారు. ఊరికే గిల్లి కజ్జాలు పెట్టుకుంటే తాళి కట్టిన భార్య కూడా వెంట నడవదని ఆయన చంద్రబాబును ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈనాడు చంద్రబాబుగారు.. మరి రాజకీయాల్లో ఆయన విడిపోయిండు. మన తెలంగాణ నుంచి పోయిండు. ఆయన ఆంధ్రలో ఉన్నడు. ఆయన ప్రాంతం ఆయన్ని అభివృద్ధి చేసుకోమను. మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకుందాం. నైబరింగ్‌ స్టేట్లు ఒకరికొకరికి సహకారాలందించుకుందాం కానీ.. ఊకే గిచ్చికయ్యం పెట్టుకుంటే.. చేసుకున్న భార్య కూడ ఉండదురా బాబో.. చంద్రబాబో.. ఊకే గిచ్చి కయ్యం పెట్టుకోకు. ఎక్కడో కరెంటు మీద అడ్డుపడతడు. ఇంకేదో అడ్డం పడతడు. వానితోటి ఒకటి అనిస్తడు.. వీనితోటి ఒకటి అనిస్తడు.. అరె, నీవేమన్న మాట్లాడితే డైరెక్టుగా నువ్వు మాట్లాడరా చంద్రబాబో.. వీళ్లతోటి, వాళ్లతోటి చంచాగాళ్లతోటి ఎందుకు మాట్లాడిస్తవ్‌?’’ అని బాబును ఉద్దేశించి నాయిని ఘాటు విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News