: నేడు ఛత్తీస్ గఢ్ పర్యటనకు చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఛత్తీస్ గడ్ లో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఆ రాష్ట్రం వెలిబుచ్చుతున్న అభ్యంతరాలను తీర్చేందుకే చంద్రబాబు ఈ పర్యటనకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఆ రాష్ట్ర రాజధాని నయా రాయ్ పూర్ నిర్మాణ రీతులను కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు. కొత్తగా రాజధాని నిర్మించుకోనున్న ఏపీ, కొత్తగా నిర్మితమైన పలు రాజధాని నగరాలను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి నారాయణ నేతృత్వంలోని రాజధాని కమిటీ ఇటీవల నయా రాయ్ పూర్ లో పర్యటించింది. తాజాగా చంద్రబాబు కూడా ఆ నగరాన్ని పరిశీలించనున్నారు. మరోవైపు ఛత్తీస్ గఢ్ లో ప్రజాపంపిణీ వ్యవస్థను కూడా చంద్రబాబు పరిశీలిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News